Sthothram Chellinthumu

[wpchords]

Coming soon!

[/wpchords]

స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము
యేసునాధుని మేలులు తలచి
స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము

Verse 1
దివారాత్రములు కంటి పాపవలె కాచి ఆ..ఆ..
దివారాత్రములు కంటి పాపవలె కాచి
దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి

Verse 2
గాఢాంధకారములో కన్నీటి లోయలలో ఆ..ఆ..
గాఢాంధకారములో కన్నీటి లోయలలో
కృషించి పోనీయక కృపలతో బలపరచితివి

Verse 3
సజీవ యాగముగా మా శరీరము సమర్పించి ఆ..ఆ..
సజీవ యాగముగా మా శరీరము సమర్పించి
సంపూర్ణ సిద్ధి నొంద శుద్ధాత్మను నొసగితివి

Verse 4
సీయోను మార్గములో పలు శోధనలు రాగా ఆ..ఆ...
సీయోను మార్గములో పలు శోధనలు రాగా
సాతాన్ను జయించుటకు విశ్వాసము నిచ్చితివి

Verse 5
సిలువను మోసుకొని సువార్తను చేపట్టి ఆ..ఆ..
సిలువను మోసుకొని సువార్తను చేపట్టి
యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి

Verse 6
పాడెద హల్లేలూయా మరణాత హల్లేలూయా ఆ..ఆ..
పాడెద హల్లేలూయా మరణాత హల్లేలూయా
సదా పాడెద హల్లేలూయా ప్రభు యేసుకే హల్లేలూయ

Coming Soon!

Songs

 
Songs  

Setlist

 
Setlist  

Chat

 
Chat  

Bible

 
Bible