[wpchords]
Coming soon!
[/wpchords]
సిలువలో సాగింది యాత్ర
కరుణామయుని దయగల పాత్ర
ఇది ఎవరి కోసమో
ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే
సిలువలో సాగింది యాత్ర
కరుణామయుని దయగల పాత్ర
Verse 1
పాలు కారు దేహము పైన
పాపాత్ముల కొరడాలెన్నో
నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి
Chorus
నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ
ఇది ఎవరి కోసమో
ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే
సిలువలో సాగింది యాత్ర
కరుణామయుని దయగల పాత్ర
Verse 2
చెళ్ళుమని కొట్టింది ఒకరు
ఆ మోముపై ఊసింది మరియొకరు
బంతులాడినారు బాధలలో వేసినారు
Verse 3
వెనుక నుండి తన్నింది ఒకరు
తన ముందు నిలిచి నవ్వింది మరియొకరు
గేలి చేసినారు పరిహాసమాడినారు
Verse 4
దాహమని అడిగింది ప్రేమ
చేదు దాహాన్ని ఇచ్చింది లోకం
చిరకనిచ్చినారు మరి బరిసెతో గుచ్చారు
Coming Soon!