[wpchords]
Coming soon!
[/wpchords]
నిను పోలిన వారెవరూ – మేలు చేయు దేవుడవు
నిన్నే నే నమ్మితిన్ నా దేవా (2)
నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటిని
నీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య (2)
ఎల్ షడ్డాయ్ ఆరాధన – ఏలోహిం ఆరాధన
అడోనాయ్ ఆరాధన – యేసు ఆరాధన (2)
కృంగియున్న నన్ను చూచి
కన్నీటిని తుడిచితివయ్య
కంటి పాప వలే కాచి
కరుణతో నడిపితివయ్య (2) ||ఎల్ షడ్డాయ్||
మరణపు మార్గమందు
నడిచిన వేళయందు
వైద్యునిగా వచ్చి నాకు
మరో జన్మనిచ్చితివయ్య (2) ||ఎల్ షడ్డాయ్||
Coming soon!!