Nee Jaldaru vrukshapu

[wpchords]

Coming soon!

[/wpchords]

నీ జల్దరు వృక్షపు నీడలలో
నేనానంద భరితుడనైతిని (2)
బలు రక్కసి వృక్షపు గాయములు (2)
ప్రేమా హస్తములతో తాకు ప్రభు (2)

నా హృదయపు వాకిలి తీయుమని
పలు దినములు మంచులో నిలచితివి
నీ శిరము వానకు తడిచినను
నను రక్షించుటకు వేచితివి

నీ పరిమళ పుష్ప సుగంధములు
నా రోత హృదయమును నింపినవి
ద్రాక్షా రస ధారల కన్న మరి
నీ ప్రేమే ఎంతో అతి మధురం

ఓ ప్రియుడా నా అతి సుందరుడా
దవళ వర్ణుడా నాకతి ప్రియుడా
వ్యసనా క్రాంతుడుగా మార్చబడి
నీ సొగసును నాకు నొసగితివి

Coming soon!

Songs

 
Songs  

Setlist

 
Setlist  

Chat

 
Chat  

Bible

 
Bible