[wpchords]
Coming soon!
[/wpchords]
నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా
సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని
రాజులకే మహరాజువు - కృపచూపే దేవుడవు
నడిపించే నజరేయుడా - కాపాడే కాపరివి
Verse 1
శ్రమలలో బహుశ్రమలలో
ఆదరణ కలిగించెను
వాక్యమే కృపా వాక్యమే
నను వీడని అనుబంధమై
నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను
నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను
నీ మాటే మధురం…
రాజులకే మహరాజువు - కృపచూపే దేవుడవు
నడిపించే నజరేయుడా - కాపాడే కాపరివి
Verse 2
మేలుకై సమస్తమును
జరిగించుచున్నావు నీవు
ఏదియు కొదువచేయవు
నిన్నాశ్రయించిన వారికి
భీకరమైన కార్యములు చేయుచున్నవాడా
సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా
ఘనపరతును నిన్నే…
ప్రేమించే యేసయ్యా - నీవుంటే చాలునయా
నడిపించే నజరేయుడా - కాపాడే కాపరివి
Verse 3
సంఘమై నీ స్వాస్థ్యమై
నను నీయెదుట నిలపాలని
ఆత్మతో మహిమాత్మతో
నను ముద్రించియున్నావు నీవు
వరములతో ఫలములతో నీకై బ్రతకాలని
తుదిశ్వాస నీ సన్నిధిలో విజయంచూడాలని
ఆశతో ఉన్నానయా…
కరుణించే యేసయ్యా
నీ కోసమే నా జీవితం
నిన్ను చేరే ఆశయం తీరాలయ్యా
నిన్ను చూసే ఆక్షణం రావాలయ్యా
Coming Soon!