Kummari O Kummari

[wpchords]

Coming soon!

[/wpchords]

కుమ్మరి ఓ కుమ్మరి
జగతుత్పత్తిదారి
జిగట మన్నైన నా వంక
చల్లగ చూడుమయ్యా

Verse 1
పనికిరాని పాత్రనని
పారవేయకుమా
పొంగి పొరలు పాత్రగా
నన్ను నింపుమయ్యా

Verse 2
సువార్తలోని పాత్రలన్నీ
శ్రీ యేసుని పొగడుచుండ
సాక్షిగానుండు పాత్రగజేసి
సత్యముతో నింపుము తండ్రి

Verse 3
విలువలేని పాత్రను నేను
కొనువారు లేరెవ్వరు
వెలలేని నీదు రక్తంబుతో
వెలుగొందు పాత్రగజేయు

Verse 4
ఆటంకములనుండి తప్పించి నన్ను
ఎల్లప్పుడు కావుమయ్యా
పగిలియున్న పాత్రను నేను
సరిచేసి వాడుమయ్యా

Verse 5
లోకాశతో నిండి ఉప్పొంగుచూ
మార్గంబు నే దప్పితిన్
మనః స్వేచ్ఛలన్నియు స్థిరమనుచునే
మనశ్శాంతి కోల్పోతిని

Verse 6
పోగొట్టుకున్న పాత్రయనుచు
పరుగెత్తి నను పట్టితివి
ప్రాణంబు నాలో ఉన్నప్పుడే
నీ పాదంబుల్ పట్టితిన్

Coming Soon!

Songs

 
Songs  

Setlist

 
Setlist  

Chat

 
Chat  

Bible

 
Bible