[wpchords]
Coming soon!
[/wpchords]
హోసన్ననుచూ స్తుతి పాడుచూ సీయోనుకు చేరెదం
హోసన్నా… హోసన్నా…
ఈ లోకయాత్రలో బాటసారులం
ఈ జీవన కడలిలో పరదేశులం (2)
క్షణభంగురం ఈ క్షయ జీవితం
అక్షయ నగరం మనకు శాశ్వతం (2)
మన్నయిన ఈ దేహం మహిమరూపమై
ధవళవర్ణ వస్త్రములు ధరియించెదము (2)
నాధుడేసుకు నవ వధువులము
నీతి పాలనలోన యువరాణులము (2)
ప్రతి భాష్ప బిందువును తుడిచివేయును
చింతలన్ని తీర్చి చెంత నిలుచును (2)
ఆకలి లేదు దప్పిక లేదు
ఆహా మన యేసుతో నిత్యమానందం (2)
Coming soon!