Gadachina Kaalamu

[wpchords]

Coming soon!

[/wpchords]


హల్లెలూయా స్తోత్రం యేసయ్యా…

గడచిన కాలము కృపలో మమ్ము
దాచిన దేవా నీకే స్తోత్రము
పగలూ రేయి కనుపాపవలె
కాచిన దేవా నీకే స్తోత్రము

Chorus
మము దాచిన దేవా నీకే స్తోత్రము
కాపాడిన దేవా నీకే స్తోత్రము
గడచిన కాలము కృపలో మమ్ము
దాచిన దేవా నీకే స్తోత్రము

Verse 1
కలత చెందిన కష్టకాలమున
కన్న తండ్రివై నను ఆదరించిన
కలుషము నాలో కానవచ్చినా
కాదనక నను కరుణించిన

Chorus
కరుణించిన దేవా నీకే స్తోత్రము
కాపాడిన దేవా నీకే స్తోత్రము
గడచిన కాలము కృపలో మమ్ము
దాచిన దేవా నీకే స్తోత్రముహల్లెలూయా స్తోత్రం యేసయ్యా…

Verse 2
లోపములెన్నో దాగి ఉన్నను
ధాతృత్వముతో నను నడిపించినా
అవిధేయతలే ఆవరించినా
దీవెనలెన్నో దయచేసినా

Chorus
దీవించిన దేవా నీకే స్తోత్రము
దయచూపిన తండ్రి నీకే స్తోత్రము
గడచిన కాలము కృపలో మమ్ము
దాచిన దేవా నీకే స్తోత్రము

పగలూ రేయి కనుపాపవలె
కాచిన దేవా నీకే స్తోత్రము
మము దాచిన దేవా నీకే స్తోత్రము
కాపాడిన దేవా నీకే స్తోత్రము

Coming Soon!

Songs

 
Songs  

Setlist

 
Setlist  

Chat

 
Chat  

Bible

 
Bible