[wpchords]
Coming soon!
[/wpchords]
దేవుడే నాకాశ్రయంబు – దివ్యమైన దుర్గము
మహా వినోదు డాపదల – సహాయుడై నన్ బ్రోచును
Chorus
అభయ మభయ మభయ మెప్పు
డానంద మానంద మానంద మౌగ
దేవుడే నాకాశ్రయంబు – దివ్యమైన దుర్గము
Verse 1
పర్వతములు కదిలిన నీ – యుర్వి మారు పడినను
సర్వమున్ ఘోషించుచు నీ – సంద్ర ముప్పొంగినన్
Verse 2
దేవుడెప్డు తోడుగాగ – దేశము వర్ధిల్లును
ఆ తావు నందు ప్రజలు మిగుల – ధన్యులై వసింతురు
Verse 3
రాజ్యముల్ కంపించిన భూ రాష్ట్రముల్ ఘోషించిన
పూజ్యుండౌ యెహోవా వైరి – బూని సంహరించును
Verse 4
విల్లు విరచు నాయన తెగ – బల్లెము నరకు నాయన
చెల్ల చెదర జేసి రిపుల – నెల్లద్రుంచు నాయనే
Verse 5
పిశాచి పూర్ణ బలము నాతో – బెనుగులాడ జడియును
నశించి శత్రు గణము దేవునాజ్ఞ వలన మడియును
Verse 6
కోటయు నాశ్రయమునై యాకోబు దేవు డుండగా
ఏటి కింక వెరవ వలయు – నెప్డు నాకు బండుగ
Coming Soon!