Bhasillenu

[wpchords]

Coming soon!

[/wpchords]

భాసిల్లెను సిలువలో పాప క్షమ
యేసు ప్రభూ నీ దివ్య క్షమ
భాసిల్లెను సిలువలో పాప క్షమ

Verse 1
కలువరిలో నా పాపము పొంచి
సిలువకు నిన్ను ఆహుతి చేసె
కలుషహరా కరుణించితివా

Verse 2
దోషము జేసినది నేనేకదా
మోసముతో బ్రతికిన నేనేకదా
మోసితివా నా శాపభారం

Verse 3
పాపము చేసి గడిరచితి మరణం
శాపమేగా నే నార్జించినది
కాపరివై నను బ్రోచితివి

Verse 4
నీమరణపు వేదన వృధగాదు
నా మది నీ వేదనలో మునిగెను
క్షేమము కలిగెను హృదయములో

Verse 5
ఎందులకో నాపై ఈ ప్రేమ
అందదయా స్వామీ నా మదికి
అందులకే భయయొందితిని

Verse 6
నమ్మిన వారిని కాదన వనియు
నెమ్మది నొసగెడి నా ప్రభుడ వని
నమ్మితి నీ పాదమ్ములను

Coming Soon!

Songs

 
Songs  

Setlist

 
Setlist  

Chat

 
Chat  

Bible

 
Bible