Ankitham Prabhu

[wpchords]

Coming soon!

[/wpchords]

అంకితం ప్రభూ నా జీవితం
నీ చరణాల సేవకే అంకితమయ్యా
నీ సేవకై ఈ సమర్పణా
అంగీకరించుము నాదు రక్షకా

Chorus
అంకితం ప్రభూ నా జీవితం
నీ చరణాల సేవకే అంకితమయ్యా

Verse 1
మోడుబారిన నా జీవితం
చిగురింపజేసావు దేవా
నిష్ఫలమైన నా జీవితం
ఫలియింపజేసావు ప్రభువా

నీ కృపలో బహుగా ఫలించుటకు
ఫలింపని వారికి ప్రకటించుటకు
అంగీకరించుము నా సమర్పణ

Verse 2
కారు చీకటి కాఠిన్య కడలిలో
నీ కాంతినిచ్చావు దేవా
చీకటిలోనున్న నా జీవితం
చిరుదివ్వెగా చేసావు ప్రభువా

నీ సన్నిధిలో ప్రకాశించుటకు
అంధకార ఛాయలను తొలగించుటకు
అంగీకరించుము నా సమర్పణ

 

Coming Soon!

Songs

 
Songs  

Setlist

 
Setlist  

Chat

 
Chat  

Bible

 
Bible