Andala Taara

[wpchords]

Coming soon!

[/wpchords]

అందాలతార అరుదెంచె నాకై
అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి
అవని చాటుచున్

ఆనందసంద్ర ముప్పొంగె నాలో
అమరకాంతిలో
ఆది దేవుని జూడ ఆశింప మనసు
పయనమైతిని

Chorus
అందాలతార అరుదెంచె నాకై
అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి
అవని చాటుచున్

Verse 1
విశ్వాసయాత్ర దూరమెంతైన
విందుగా దోచెను
వింతైన శాంతి వర్షించె నాలో
విజయపథమున

విశ్వాలనేలెడి దేవకుమారుని
వీక్షించు దీక్షలో
విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ
విశ్రాంతి నొసగుచున్

Verse 2
యెరూషలేము రాజనగరిలో
యేసును వెదకుచు
ఎరిగిన దారి తొలగిన వేళ
ఎదలో కృంగితి

యేసయ్యతార ఎప్పటివోలె
ఎదురాయె త్రోవలో
ఎంతో యబ్బురపడుచు విస్మయ మొందుచు
ఏగితి స్వామి కడకు

Verse 3
ప్రభుజన్మస్ధలము పాకయేగాని
పరలోక సౌధమే
బాలునిజూడ జీవితమెంత
పావనమాయెను

ప్రభుపాదపూజ దీవెనకాగా
ప్రసరించె పుణ్యము
బ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె
ఫలియించె ప్రార్ధన

Coming Soon!

Songs

 
Songs  

Setlist

 
Setlist  

Chat

 
Chat  

Bible

 
Bible