Margamu Choopumu

[wpchords]

Coming soon!

[/wpchords]

మార్గము చూపుము ఇంటికి – నా తండ్రి ఇంటికి
మాధుర్య ప్రేమా ప్రపంచమో – చూపించు కంటికి

Verse 1
పాప మమతల చేత – పారిపోయిన నాకు ప్రాప్తించె క్షామము
పశ్చాత్తాప్పమునొంది తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము
ప్రభు నీదు సిలువ – ముఖము చెల్లని నాకు పుట్టించె ధైర్యము

Chorus
మార్గము చూపుము ఇంటికి – నా తండ్రి ఇంటికి
మాధుర్య ప్రేమా ప్రపంచమో – చూపించు కంటికి

Verse 2
ధనమే సర్వంబనుచు- సుఖమే స్వర్గంబనుచు తండ్రిని వీడితి
ధరణి భోగములెల్ల – బ్రతుకు ధ్వంసము జేయ దేవా నిను చేరితి
దేహీ అని నీ వైపు – చేతులెత్తిన నాకు దారిని జూపుము

Chorus
మార్గము చూపుము ఇంటికి – నా తండ్రి ఇంటికి
మాధుర్య ప్రేమా ప్రపంచమో – చూపించు కంటికి

Verse 3
దూర దేశములోన – బాగుందుననుకొనుచు తప్పితి మార్గము
తరలిపోయిరి నేను – నమ్మిన హితులెల్ల తరిమే దారిద్య్రము
దాక్షిణ్య మూర్తి నీ – దయ నాపై కురిపించి ధన్యుని చేయుము

Chorus
మార్గము చూపుము ఇంటికి – నా తండ్రి ఇంటికి
మాధుర్య ప్రేమా ప్రపంచమో – చూపించు కంటికి

Verse 4
అమ్ముకొంటిని నేను – అధముడొకనికి నాడు ఆకలి బాధలో
అన్యాయమయిపోయే – పందులు సహ వెలివేయ అలవడెను వేదన
అడుగంటె అవినీతి – మేల్కొనియె మానవత ఆశ్రయము గూర్చుము

Chorus
మార్గము చూపుము ఇంటికి – నా తండ్రి ఇంటికి
మాధుర్య ప్రేమా ప్రపంచమో – చూపించు కంటికి

Verse 5
కొడుకునే కాదనుచు – గృహమే చెరసాలనుచు కోపించి వెళ్ళితి
కూలివానిగనైన – నీ యింట పని చేసి కనికరమే కోరుదు
కాదనకు నా తండ్రి – దిక్కెవ్వరును లేరు క్షమియించి బ్రోవుము

Chorus
మార్గము చూపుము ఇంటికి – నా తండ్రి ఇంటికి
మాధుర్య ప్రేమా ప్రపంచమో – చూపించు కంటికి

Verse 6
నా తండ్రి నను జూచి – పరుగిడిచూ ఏతెంచి నాపైబడి ఏడ్చెను
నవ జీవమును గూర్చి – ఇంటికి తోడ్కొని వెళ్లి నన్నూ దీవించెను
నా జీవిత కథయంత – యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమై యుండును

Chorus
మార్గము చూపుము ఇంటికి – నా తండ్రి ఇంటికి
మాధుర్య ప్రేమా ప్రపంచమో – చూపించు కంటికి

Coming soon!!

Songs

Songs  

Setlist

Setlist  

Chat

Chat  

Bible

Bible